ఆరెక్స్ 100 అక్కడ ఎవరంటే..!

-

ఈమధ్య వచ్చిన సినిమాల్లో చిన్న బడ్జెట్ తో వచ్చి బాక్సాఫీస్ పై వసూళ్ల హంగామా సృష్టించిన సినిమా ఆరెక్స్ 100. అజయ్ భూపతి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ జంటగా నటించారు. 2 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా 15 కోట్ల పైగా వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా తెలుగులో హిట్ అయ్యే సరికి తమిళ, హింది భాషల్లో కూడా మంచి డిమాండ్ ఏర్పడింది.

హిందిలో అజయ్ భూపతి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుండగా తమిళ రీమేక్ మాత్రం తాను కుదరదని చెప్పాడట. ఇక తమిళ ఆరెక్స్ 100 రైట్స్ ను హీరో ఆది పినిశెట్టి సొంతం చేసుకున్నాడట. తన ఓన్ ప్రొడక్షన్ లో ఈ సినిమా నిర్మించాలని చూస్తున్నాడట. ప్రస్తుతం అక్కడ ఈ సినిమా రీమేక్ చేసే దర్శకుడి వేటలో ఉన్నాడట. ఇక హీరోయిన్ గా పాయల్ నటిస్తుందా లేక వేరే హీరోయిన్ ను తీసుకుంటారా అన్నది తెలియాల్సి ఉంది.

ఆరెక్స్ 100 మూవీలో ఆది పినిశెట్టి.. తప్పకుండా తమిళ ఆడియెన్స్ కు ఈ సినిమా మంచి అనుభూతి ఇస్తుందని చెప్పొచ్చు. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అవడం వల్ల తమిళ తంబీలు కూడా ఆదరించే అవకాశం ఉంది. మరి ఈ సినిమాకు సంబందించిన మరిన్ని డీటైల్స్ త్వరలో వెళ్లడవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news