మను ట్రైలర్.. ఇదేదో కొత్తగా ఉందే.. డోంట్ మిస్

-

టాలెంట్ చూపించాలి అంటే ఒకప్పుడు అవకాశాలను వెత్తుకుంటూ వెళ్లాలి కాని ఇప్పుడు అలా కాదు తమలో టాలెంట్ ఉంటే అవకాశాలే వెతుక్కుంటూ వస్తాయి. ఇప్పటి నవతరం సృష్టిస్తున్న కొత్త ట్రెండ్ ఇదే. ఆలోచనకు.. ప్రయోగాలకు ఏమాత్రం వెనుకాడకుండా సినిమాలు చేస్తున్న నేటి యువ దర్శకుల సృజనాత్మకత సూపర్బ్ అని చెప్పొచ్చు. ఈమధ్య యంగ్ టాలెంటెడ్ డైరక్టర్స్ ప్రేక్షకులకు తమ సినిమాలతో కొత్త అనుభూతిని కలిగిస్తున్నారు.

ఈమధ్యనే అ! తో అవాక్కయ్యేలా చేసిన ప్రశాంత్ వర్మ ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్ చేశాడు. ఇక ఇప్పుడు అదే షార్ట్ ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన ఫణీంద్ర చేసిన సినిమా మను. బ్రహ్మానందం కొడుకు గౌతం, చాందిని చౌదరి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మను. ఈ సినిమా ట్రైలర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది.

కాన్సెప్ట్ మూవీలా అనిపిస్తున్న ఈ ట్రైలర్ ఒక్కసారి చూస్తే చాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించేలా ఉంది. థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ మను ట్రైలర్ ఇంప్రెస్ చేయగా ప్రేక్షకులను ఎలాంటి సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news