మీ దగ్గర ఇలాంటి రూపాయి బిళ్ళ ఉందా..? అయితే మీ దశ తిరిగిపోయినట్లే.. ఈ ఒక్క రూపాయి నాణెం విలువ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అక్షరాలా ఒక రూపాయి నాణెం విలువ పాతిక లక్షలంట.. అవును మీరు విన్నది నిజమే. కానీ ఇక్కడ ఒక తిరకాసు ఉందండోయ్.. ఏంటంటే, ఈ రూపాయి నాణెం కనీసం వందేళ్ల కిందటిది అయి ఉండాలి. షాక్ అయ్యారు కదా..! అసలు వివరాలలోకి వెళితే.. పురాతన నాణేలను దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ మార్కెట్ సంస్థ ఇండియామార్ట్ వేలం వేస్తుంటుంది. మీ వద్ద అలాంటి పురాతన, అపురూప నాణెం ఉంటే మీరు దాన్ని వేలంలో ఉంచి లక్షల రూపాయలు గెలుచుకోవచ్చు అన్నమాట.. ఒకవేళ మీదగ్గర 1913 నాటి రూపాయి నాణెం ఉంటే దాన్ని మీరు రూ. 25 లక్షలకు వేలం వేయవచ్చు. ఇకపోతే ఈ నాణెం ఎలా ఉంటుంది అంటే.. వెండితో రూపొందించబడి ఉంటుంది. ఇది విక్టోరియా కాలం నాటి నాణెం.
అలాగే 18వ శతాబ్ధం నాటి నాణెం ధరను రూ. 10 లక్షలుగా నిర్ణయించగా, 1818 లో ఈస్టిండియా కంపెనీ తయారు చేసిన ఈ నాణెం ఖరీదును ఇండియామార్ట్ పై రూ. 10లక్షలుగా ఖరారు చేశారు. ఈ అరుదైన పురాతన నాణెం ఎలా ఉంటుంది అంటే… ఈ నాణెం పై హనుమాన్ ఫోటో ముద్రితమై ఉంటుంది. మీరు అరుదైన, పురాతన నాణేలను విక్రయించదలిస్తే మీరు ఇండియామార్ట్ వెబ్‌సైట్ ఇండియామార్ట్. కామ్ ను సంపద్రించవచ్చు. ఈ వెబ్‌సైట్ లో మీ ఖాతాను తెరిచి, వెబ్‌సైట్ లో విక్రేతగా మీ పేరు నమోదు చేసుకోవాలి. రిజిస్ర్టేషన్ తర్వాత మీ వద్దనున్న నాణేలను అప్ లోడ్ చేసి వాటిని సేల్‌లో ఉంచవచ్చు.