ఇంత దారుణమా.. హత్రాస్ ఘటన మరవకముందే..!

-

దేశంలో రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు ఆడపిల్లలు అందరినీ తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవలే దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ ప్రాంతంలో దళిత యువతిపై అత్యాచారం హత్య ఘటన మరవకముందే మరిన్ని దారుణ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చి అందరిని ఒక్క సారిగా ఉలిక్కి పడేలా చేసింది.

పొలం పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన 18 సంవత్సరాల యువతి పై కన్నేసిన కామాంధులు దారుణంగా యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడటమే కాదు అనంతరం మరింత కిరాతకంగా గొంతు కోసి దారుణంగా హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని బారాబంకి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. పొలానికి వెళ్లిన కూతురు ఎంతకి తిరిగి రాకపోవడంతో కంగారు పడిపోయిన తల్లిదండ్రులు పొలానికి వెళ్లి చూడగా రక్తపుమడుగులో కూతురు విగతజీవిగా కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news