అక్రమ ఇంట్లో అక్రమ నేత.. మంత్రి అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

-

కరకట్ట పై ఉన్న చంద్రబాబు నాయుడి ఇంటికి ఇటీవలే మరో సారి వరదల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. కరకట్ట దగ్గర ఉన్న ఇంట్లోనే ఎక్కువశాతం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ ఉండటం అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చి వెళ్లిపోవడంపై కూడా అధికార వైసిపి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు ఇక ఇటీవల ఈ విషయంపై స్పందించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.

కరకట్ట వద్ద ఉన్న అక్రమ నిర్మాణంలో ఎన్నో అక్రమాలకు పాల్పడిన నేత చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. చంద్రబాబు అధికారంలో ఉన్నన్ని రోజులు ఎన్నో అక్రమాలు చేశారు అంటూ ఆరోపించిన ఆయన ఎన్నో ప్రాజెక్టులను ముంపుకు కారణం అయ్యారు అంటూ విమర్శించారు. చంద్రబాబు అంత అక్రమార్కుడూ కాబట్టి ఆయన అధికారంలో ఉన్నన్ని రోజులు కనీసం రాష్ట్రంలో వర్షపు చుక్క కూడా పడలేదు అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.

Read more RELATED
Recommended to you

Latest news