బిగ్ బాస్: మోనాల్ తో అవినాష్ డాన్స్.. ఆరియానాతో ముగిసినట్టేనా..?

-

గత రెండు శుక్రవారాల మాదిరి కాకుండా ఈ శుక్రవారం ఎపిసోడ్ కాస్త కొత్తగా సాగింది. మొదట ఇచ్చిన బైక్ టాస్కులో మెహబూబ్ కప్ అందుకోగా ఆ తర్వాత లేడీస్ పార్టీ మంచి ఉత్సాహాన్ని ఇచ్చింది. కేవలం లేడీస్ కోసమే ఏర్పాటు చేసిన ఈ పార్టీలోకి ఒక్కొక్కరుగా వచ్చిన అబ్బాయిలు తమదైన శైలిలో ఇంప్రెస్ చేసే పనిలో పడ్డారు. అమ్మాయిలందరూ అందంగా రెడీ అయ్యారు. ఈ పార్టీలోకి వచ్చిన అబ్బాయిల్లో అభిజిత్, సోహైల్, అఖిల్ బాగా ఆకట్టుకున్నారు.

ఇక్కడున్న అమ్మాయిల్లో ఎవరితో డేట్ కి వెళ్తావ్ అని ఆరియానా, అభిజిత్ ని అడగ్గా, నువ్వు అడిగావ్ కాబట్టి నీతోనే అని చెప్పడంతో వీరిద్దరి మధ్య స్నేహం మరింత గట్టి పడిందని తెలుస్తుంది. ఇటు ఆరియానా, అభిజిత్ దగ్గరవుతోంటే అవినాష్, మోనాల్ కి దగ్గరవుతున్నాడేమో అనిపిస్తుంది. అర్థరాత్రి ఒంటిగంట దాటాక గార్డెన్ ఏరియాలో వారిద్దరే డాన్స్ చేయడం ఈ విధమైన అనుమానాలకి తావిస్తుంది.

ఐతే ఇక్కడో అనుమానం అందరినీ తొలిచేస్తుంది. ఎవరో చెప్పినట్టు టక్కున తాము స్నేహం చేసే వారిని మార్చడం కొద్దిగా వింతగా అనిపిస్తుంది. ట్రయాంగిల్ స్టోరీ జరుగుతుందని చెప్పబడుతున్న దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ దాన్లోండి అభిజిత్ ని తప్పిస్తున్నారేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. మరి బిగ్ బాస్ ఏం చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news