ఆర్.ఆర్.ఆర్. “రచ్చ”ను ఓడించిన జగన్ “మౌనం”!

-

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ఇచ్చిన బీ-ఫారంపై గెలిచి.. జగన్ పార్టీ గుర్తు ఫ్యాన్ సింబల్ పై గెలిచి.. జగన్ పార్టీ ఎంపీగా హస్తినలో పార్లమెంటులోకి అడుగుపెట్టి.. ఆఖరికి ఆ పార్టీ అధినేత జగన్ నే తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన నరసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు కు చేదు అనుభ‌వం ఎదురైంది! ఈ రాజక్రీయ క్రీడలో ఆర్.ఆర్.ఆర్. “రచ్చ”(బండ)ను జగన్ “మౌనం” ఓడించింది!

raghu

అవును… పొద్దున్నలేస్తే వైఎస్ జగన్ పై రాజకీయ ప్రత్యర్ధులకంటే ఎక్కువగా విమర్శలు చేస్తూ.. ఈ రచ్చకు రచ్చబండ అని నామకరణం చేసి పసుపుమీడియాకు ఫుల్ మీల్స్ పెడుతున్న ఆర్.ఆ.ఆర్. ను పార్ల‌మెంట‌రీ స్టాండింగ్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తొల‌గిస్తూ లోక్‌ స‌భ స‌చివాల‌యం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఇదే క్రమంలో సబార్డినేట్ లెజిస్లేచర్ స్టాండింగ్ కమిటీ నూతన చైర్మన్‌ గా వైఎస్సార్‌సీపీ ఎంపీ బాలశౌరిని నియమించారు.

అయితే… తనకు ఈ పదవి వచ్చింది జగన్ వల్ల కాదు అని.. తనకు హస్తినలో ఉన్నది మామూలు సర్కిల్ కాదు అని.. కేంద్రంలో ఎంత పెద్దవారినైనా డోర్ తీసుకుని నేరుగా వారి వారి ఆఫీసుల్లోకి వెళ్లగల చనువు తన సొంతమని చెప్పుకొస్తుంటారు ఆర్.ఆర్.ఆర్.! కానీ… ఈ విషయంలో అవన్నీ హంబక్కు మాటలు అని తాజా నిర్ణయంతో తేలిపోయిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

ఇటీవ‌ల రూ.826.17 కోట్ల మోసానికి పాల్ప‌డ్డాడ‌ని పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (పి.ఎన్.బి) నేతృత్వంలోని క‌న్సార్టియం ఫిర్యాదు మేరకు ఆర్.ఆర్.ఆర్. పై సీబీఐ కేసు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. త‌న‌పై సీబీఐ కేసు న‌మోదు చేసిన‌ప్ప‌టి నుంచి.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కుట్ర‌లు పన్నారంటూ ఎన్నెన్నో విమ‌ర్శ‌లు చేస్తూ వ‌స్తున్నారు! అయితే… తన పార్టీ ఎంపీ త‌న‌ను ఎన్ని మాట‌లంటున్నా.. జ‌గ‌న్ ఏనాడూ నోరు తెర‌వ‌లేదు.. కానీ త‌న మౌనంతో ఆర్.ఆర్.ఆర్. స్థానం ఏంటో చెప్ప‌క‌నే చెప్పారనేది లేటెస్ట్ కామెంట్!!

Read more RELATED
Recommended to you

Latest news