మద్దెల చెరువు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి అనే పేరు 2005 జనవరి.. 2011 జనవరిలో ఆంధ్రప్రదేశ్ లో ఈ పేరు బాగా వినిపించిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి, టీడీపీ నేత పరిటాల రవిని 2005 జనవరి 24న అతిదారుణంగా హతమార్చిన కేసులో కీలక నిందితుడు సూరి. అనూహ్యంగా 2011 జనవరి 04న తన అనచరుడు భానుకిరణ్ చేతిలో హత్యకు గురయ్యాడు. హైదరాబాద్ లో ఆయన ప్రయాణిస్తున్న కారు పై భానుకిరణ్ కాల్పులు జరపగా. సూరి అక్కడికక్కడే మరణించాడు.
ఇక ఆ తరువాత పోలీసులు భాను కిరణ్ ను మధ్య ప్రదేశ్ లో అరెస్ట్ చేసి.. నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. 2018 డిసెంబర్ లో కోర్టు అతనికీ యావజ్జీవ కారాగార శిక్ష, రూ.20వేలు జరిమానా విధించింది. నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. హైకోర్టుకు వెళ్లిన భానుకిరణ్ కి చుక్కెదురైంది. ఈ కేసులో నాంపల్లి కోర్టు తీర్పును సమర్థించింది. 12 ఏళ్లుగా జైలులో ఉన్న భానుకిరణ్ కు నిన్న సీఐడీ ఆర్మ్స్ యాక్ట్ కేసులో బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. బెయిల్ రావడంతో తాజాగా భానుకిరణ్ చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యాడు.