అస్సాం, మిజోరం సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులోని రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో పలువురు గాయపడినట్టు చెబుతున్నారు. ఈ గొడవ ప్రారంభం అయిన కొంత సేపటికి భద్రతా సిబ్బంది రంగప్రవేశంతో ప్రస్తుతానికి అయితే పరిస్థితి అదుపులోనే ఉంది. ఘర్షణకు దారి తీసిన పరిణామాలు, తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు.
అస్సాంలోని లైలాపూర్, మిజోరంలోని వైరెంగ్టే గ్రామాల మధ్య ఘర్షణ మొదలైందని, రెండు వర్గాల ప్రజలు కర్రలతో దాడి చేసుకున్నారని రాళ్లు రువ్వుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే దాదాపు 20 గుడిసెలకు నిప్పుపెట్టారని తెలుస్తోంది. సరిహద్దులో చెట్లు కొట్టే విషయంలో వీరి మధ్య వివాదం మొదలైందని స్థానికులు అంటుండగా.. బయటి వారి జోక్యం ఉందని అధికారులు భావిస్తున్నారు.