ఏకతాటి పైకి 11విపక్ష పార్టీలు..ఇమ్రాన్ కి ఇక కష్టమేనా…?

-

పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు గడ్డురోజులు దాపురించినట్టు కనిపిస్తోంది. ఇమ్రాన్‌ ప్రభుత్వంపై పోరుబాట పట్టిన విపక్షాల కూటమి.. రోజురోజుకూ ఆందోళనను ఉధృతం చేస్తోంది. పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్ష కూటమి పాకిస్థాన్‌ డెమొక్రాటిక్‌ మూవ్‌మెంట్.. తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. పెద్ద పెద్ద నియంతలే చరిత్రలో కలిసిపోయారని ఈ కీలుబొమ్మ ప్రభుత్వం ఏం చేయగలదని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత బిలావల్‌ భుట్టో జర్దారీ ఇమ్రాన్ పై ఫైరయ్యాడు.

పాకిస్థాన్‌లో ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా గత నెల 20న 11 విపక్ష పార్టీలు కలిసి పీడీఎం పేరిట ఒకే వేదికపైకి వచ్చాయి. జనవరిలో దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి తరలివచ్చే మద్దతుదారులతో ఇస్లామాబాద్‌లో భారీ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దానికి సన్నాహకంగా ప్రస్తుతం వివిధ నగరాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు. లాహోర్‌లో శుక్రవారం తొలి ర్యాలీ నిర్వహించగా.. ఆదివారం కరాచీలో రెండో ర్యాలీ జరిగింది. మొత్తంగా విపక్షాలన్నీ కలిసి ఇమ్రాన్‌ను ఇరుకు పెట్టేందుకు భారీ వ్యూహమే రచించినట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news