శాంసంగ్ కంపెనీ గెలాక్సీ ఫిట్ 2 పేరిట ఓ నూతన స్మార్ట్ బ్యాండ్‌ను భారత్ లో మంగళవారం విడుదల చేసింది. దీంట్లో 1.1 ఇంచుల అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 70 రకాల వాచ్ ఫేస్‌లను దీంట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 5 రకాల యాక్టివిటీలను ఈ బ్యాండ్ ఆటోమేటిగ్గా డిటెక్ట్ చేయగలదు. హార్ట్ రేట్, డిస్టాన్స్, కెలోరీస్ బర్న్‌డ్ వంటి ఫీచర్లను దీంట్లో అందిస్తున్నారు.
ఈ బ్యాండ్‌లో స్లీప్ ట్రాకింగ్ ఫీచర్‌ను అందిస్తున్నారు. దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ లభిస్తోంది. 159 ఎంఏహెచ్ బిల్టిన్ బ్యాటరీని దీంట్లో అమర్చారు. అందువల్ల 15 నుంచి 21 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభిస్తుంది. ఈ వాచ్‌లో 2 ఎంబీ ర్యామ్‌ను ఏర్పాటు చేశారు. 32 ఎంబీ వరకు స్టోరేజ్ లభిస్తుంది. ప్లాస్టిక్ స్ట్రాప్‌ను ఈ బ్యాండ్‌కు ఇచ్చారు.
ఈ బ్యాండ్‌ను ఆండ్రాయిడ్ 5.0 లేదా ఐఓఎస్ 10.0 అంతకన్నా పైన వెర్షన్‌ను కలిగిన డివైస్‌లకు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేయవచ్చు. జైరోస్కోప్, ఫొటో ప్లీథైస్మోగ్రఫీ, యాక్సలరోమీటర్ ఫీచర్లు కూడా దీంట్లో లభిస్తున్నాయి.
గెలాక్సీ ఫిట్ 2 స్మార్ట్ బ్యాండ్ బ్లాక్, రెడ్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. దీని ధర రూ.3,999గా ఉంది. అమెజాన్‌తోపాటు ఆఫ్ లైన్ రీటెయిల్ స్టోర్స్‌లోనూ ఈ బ్యాండ్‌ను వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.