ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటుంది కంగనా రనౌత్. అయితే కంగనారనౌత్ ఓ వైపు తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకోవటమే కాదు… తన వివాదాలతో సోషల్ మీడియాలో మరింత క్రేజ్ సంపాదించుకుంది అని చెప్పాలి. ఈ మధ్య కాలంలో అయితే ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉంది ఈ కాంట్రవర్షియల్ బ్యూటీ.
అయితే ఇటీవలే కంగనారనౌత్ కి సోషల్ మీడియా వేదికగా రేప్ చేస్తామంటూ బెదిరింపులు వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తన బ్రదర్ మ్యారేజ్ లో బిజీ బిజీగా ఉన్న కంగనా రనౌత్ వెడ్డింగ్ ఫోటోలను కూడా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఇటీవలే ఒడిశాకు చెందిన ఓ న్యాయవాది కంగనా ఇప్పటికైనా నీ ఓవరాక్షన్ ఆపకపోతే నడిరోడ్డు మీద రేప్ చేస్తా అంటూ బెదిరింపులకు పాల్పడినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. అయితే అటు వెంటనే స్పందించిన సదరు న్యాయవాది తన అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేసి ఇలాంటి దారుణ వ్యాఖ్యలు చేశారని క్షమాపణలు చెప్పారు.