దేశ ప్రజలను ప్రధాని మోడీ మోసగించారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం విమర్శించారు. మధ్యాప్రదేశ్ లోని ఎన్నికల విషయమై మీడియాతో మాట్లాడుతూ…2014 ఎన్నికల్లో గెలుపు కోసం ఎన్నో వాగ్దానాలు చేశారు.. ప్రతి ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని, ప్రజల బ్యాంక్ ఖాతాల్లో రు.15లక్షల నగదు డిపాజిట్ చేస్తామని అన్నారు. నల్ల ధనాన్ని వెనక్కి తీసుకువస్తానని గత లోక్‌సభ ఎన్నికల్లో మోడీ హామీలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతామేనన్న భయంతో ప్రధాని మోడీ కాంగ్రెస్ పట్ల మనస్సులో ద్వేషాన్ని నింపుకున్నారని విమర్శించారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎంతో నేర్పుగా ఓర్పుగా మర్యాదగ మాట్లాడుతుంటే… మోడీ మాటల్లో మాత్రం అది లోపిస్తోందని విమర్శించారు. ఈ మధ్య కాలంలో మోదీ ప్రసంగాన్ని వింటే ఆ విషయం అర్థమవుతుందన్నారు. ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయారని అన్నారు. భాజపా వస్తే సామాన్యులకు ఏదో మేలు జరుగుతున్నారనుకున్నారు.. కానీ వారందరిని నోట్ల రద్దుతో రోడ్డుపై పడేసిన ఘనత మోదీకే దక్కిందంటూ ఎద్దేవా చేశారు.