ఆ అత్యాచారంపై స్పందించరా : నిర్మల సీతారామన్

-

ఇటీవలే హత్రాస్ లో దళిత యువతిపై జరిగిన అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే కాదు నిరసనలు ర్యాలీలు కూడా చేపట్టిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అనవసర విమర్శలు చేస్తూ కేసును తప్పుదారి పట్టిస్తుంది అని విమర్శలు కూడా ఎదుర్కొంది. ఇటీవలే కాంగ్రెస్ తీరుపై మండిపడ్డ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ విమర్శలు గుప్పించారు.

మొన్నటికి మొన్న బీజేపీ పాలిత ప్రాంతమైన ఉత్తర ప్రదేశ్లో యువతిపై అత్యాచారం జరిగిన ఘటనలో కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ నిరసనలు తెలిపిందని.. కానీ ఇటీవలే కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన పంజాబ్ లో ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం చేస్తే కాంగ్రెస్ మౌనంగానే ఉండిపోయింది అంటూ విమర్శించారు. అత్యాచారాల విషయంలో కూడా కాంగ్రెస్ స్వార్ధపూరిత రాజకీయాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని విమర్శించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.

Read more RELATED
Recommended to you

Latest news