బ్యాంకులో రుణం తీసుకున్న వారికి ఊరట.. వచ్చేనెల కల్లా ఖాతాల్లోకి నగదు జమ..

-

బ్యాంకులో రుణం తీసుకున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. మనం బ్యాంకులో రుణం తీసుకున్నప్పుడు వడ్డీ కట్టలేని పరిస్థితులలో వడ్డీకి కూడా వడ్డీ పడుతుంది కదా.. !! అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వడ్డీ మీద వడ్డీ మినహాయింపు అంశానికి సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. మోదీ సర్కార్ రూ.2 కోట్ల వరకు రుణాలకు మారటోరియం గడువులో వడ్డీ మీద వడ్డీ మాఫీ చేయనుంది. దీంతో ఈఎంఐ మారటోరియం బెనిఫిట్ పొందిన వారికి ఊరట కొంచెం కలుగనుంది.

కరోనా వైరస్ వల్ల దేశంలోని ప్రజలు ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అందుకనే ఆర్థిక ఇబ్బందుల కారణంగా లోన్ ఈఎంఐ కట్టలేని వారికి ఊరట కలుగుతుంది. అయితే కొంతమంది మాత్రం కరెక్ట్‌గా ప్రతి నెలా ఈఎంఐ కడుతూ ఉంటారు. మరి అలాంటి లాంటి వాళ్లకి బెనిఫిట్ ఉండదా..? అని ప్రశ్న చాలా మందికి వస్తుంది.. అయితే వారికి కూడా కేంద్ర ప్రభుత్వం ప్రయోజనం కలిగించనుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నియంత్రణలోని కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు, మైక్రోఫైనాన్స్ సంస్థల కోసం ప్రత్యేక స్కీమ్‌ను నోటిఫై చేసింది. కేంద్రం వీటికి కస్టమర్ల తరుపున మార్చి 1 నుంచి ఆగస్ట్ 31 వరకు కాలానికి గాను వడ్డీ మొత్తాన్ని వీటికి తిరిగి అందించనుంది. అయితే ఈ పధకం ఈ లోన్స్ వారికీ మాత్రమే వర్తిస్తుంది. అవేంటంటే ఎంఎస్ఎంఈ రుణాలు, ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్, కన్సూమర్ డ్యూరబుల్స్ లోన్స్, క్రెడిట్ కార్డు బకాయిలు, వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్, కన్జప్షన్ రుణాలకు మాత్రమే కేంద్ర ప్రభుత్వ పథకం వర్తిస్తుంది. వచ్చే నెల నవంబర్ 5 కల్లా వడ్డీ మీద వడ్డీ మొత్తం డబ్బులు కస్టమర్ల లోన్ అకౌంట్‌కు జమవుతుంది. రుణ గ్రహీతలందరికీ ఈ బెనిఫిట్ అందనుంది.

ఉదాహరణకు రూ.50 లక్షల హోమ్ లోన్ ఔట్ స్టాండింగ్‌పై రూ.12,425 ఆదా కానుంది. ఇక్కడ హోమ్ లోన్‌పై వడ్డీ రేటు 8 శాతంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం సాధారణ వడ్డీకి, చక్ర వడ్డీకి మధ్య వ్యత్యాసాన్ని కస్టమర్లకు తిరిగి అందిస్తోంది. అంటే 50 లక్షలు రుణం తీసుకున్న వారికీ వడ్డీ మీద వడ్డీకి గాను వీరికి రూ.12 వేలకు పైగా మిగులుతుంది అన్నమాట..ఈ డబ్బులు రుణ గ్రహీతల లోన్ అకౌంట్‌కు డైరక్ట్ గా చేరతాయి.

Read more RELATED
Recommended to you

Latest news