తమిళనాడు ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది..వచ్చే రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని,లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరించింది..ఈ ఉదయం 10 గంటల వరకు భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తాజా హెచ్చరికలు జారీ చేశారు.
భారీ వర్షాలు చెన్నై నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. గత రాత్రి నుంచి మహానగరంలో ఎడతెరపిలేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి..అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావోద్దంటూ చెన్నై నగరపాలక సంస్థ అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు..తిరువాన్మియూర్, మైలాపూర్, రాయపెట్ట, అడయార్‌లలో వర్షాలు కురుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు నీట మునిగాయి. వర్షపు నీటిని తొలగించడానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు.