పోలవరం నిధులపై కేంద్రం కొత్త ట్విస్ట్..షాక్‌లో ఏపీ సర్కార్‌.

-

పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం కొర్రీలు పెడుతుంది.. ప్రాజెక్ట్ నిర్మాణంపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం మరో ట్విస్ట్ ఇచ్చింది..గతం ఇచ్చిన నిధుల వివరాలు చేపితేనే మిగతా రూ.9,288 కోట్లు ఇస్తామని తేల్చి చెప్పింది కేంద్ర జల శక్తి మంత్రిత్య శాఖ..భవిష్యత్లో ఖర్చు చేయబోయే నిధుల వివరాలను కూడా చెప్పాలని కేందం స్పష్టం చేసింది..పోలవం నిర్మాణం కోసం గతంలో ఇచ్చిన నిధులు దారి మళ్లించినట్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది..దీంతో తక్షమే ఇవ్వాల్సిన రూ.2,234 కోట్లుపై కేంద్రం మెలిక పెట్టింది..ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ లిఖిత పూర్వవర్తమానం పంప్పినట్లు తెలుస్తుంది..ఏ పనుల కోసం అయితే గతంలో నిధులు మంజూరు చేశామో వాటికే ఖర్చు చేయాలని..

కాని రాష్ట్ర ప్రభుత్వం ఇతర పనుల కోసం ఉపయోగించారని కేంద్రం తెలిపింది..పూర్తి వివరాలను నవంబర్‌ 2న జరిగబోయే పోలవరం అథారీటీ సమావేశంలో కేంద్రం తన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది..పోలవరం నిర్మాణం కాలయాపన కోసమే కేంద్రం ఇలాంటి ఎత్తుగడలు వేస్తుందని ఏపీ ప్రభుత్వం సందేహం వక్తం చేస్తుంది..పోలవరం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదట ఖర్చు చేసి తర్వాత కేంద్రం నుంచి రీయింబర్స్ మెంట్ రూపంలో రాష్ట్రం తీసుకుంటుందని..ఇప్పుడు ఆ నిధుల గురించి వివరాలు అడగటంపై ప్రభుత్వ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి..కేంద్రం పోలవరం నిర్మాణంపై ఈ విధంగా మెలికలు పెట్టడంపై భవిష్యత్‌లో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం సాధ్యాసాధ్యలపై జలవనరుల శాఖ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news