SC వర్గీకరణపై మళ్లీ రచ్చ రాజేస్తున్న టీడీపీ…!

-

SCవర్గీకరణపై టీడీపీ మళ్లీ రచ్చ రాజేస్తోంది. 2014లో అధికారంలోకి వచ్చిన తరువాత ఆ అంశాన్ని పక్కన పెట్టిన తెలుగు దేశం…ఇప్పుడు మళ్లీ ధైర్యం చేస్తోంది. మాల వర్గం ఓట్లు వచ్చే అవకాశం లేదని పార్టీ డిసైడ్ అయ్యందా కొత్త ఈక్వేషన్ ఎంత వరకు సెట్ అవుతుంది అన్నది ఇప్పుడు పార్టీ వర్గాల్లో అంతర్గతంగా చర్చ నడుస్తుంది.

అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జూపుడి వంటి మాల వర్గం నేతలను పార్టీలో చేర్చుకని నామినేటెడ్ పదవులు కూడా ఇచ్చింది. అయితే ఇంత కాలం తరువాత ఇప్పుడు సున్నితమైన అంశాన్ని మళ్లీ తెరపైకి తెస్తోంది. టిడిపిలోని మదిగ వర్గం నేతలు ప్రత్యేక సమావేశం పెట్టుకుని వర్గీకరణపై చర్చలు మొదలు పెట్టారు. అధినేతపైనా ఒత్తిడితెచ్చి వర్గీకరణ విషయాన్ని మనుగడలోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో మొత్తం 29 ఎస్‌సీ రిజర్వ్ సీట్లు ఉన్నాయి. ఇందులో 2019 ఎన్నికల్లో 27 సీట్లు వైసీపీ గెలుచుకోగా….ఒక్క చోట టిడిపి గెలిచింది. తూర్పు గోదావరిలో రిజర్వ్‌ నియోజవర్గమైన రాజోలులో జనసేన నేత గెలిచారు. మొత్తం 29లో 27 గెలవడం ద్వారా వైసీపీ తన పట్టు నిలుపుకుంది.

మొత్తం 27 ఎమ్మెల్యేలలో 9మంది మాదిగ వర్గం నేతలు కాగా…..18 మంది మాల వర్గం వారు ఎన్నికల్లో గెలిచారు. వీటితో పాటు ఎస్సీ ఓట్లు కీలకంగా ఉండే ఇతర అనేక నియోజకవర్గాల్లో వైసిపికి 90 శాతం పైగా ఓట్లు పోలయ్యాయి. మొదటి నుంచి ఎస్‌సీ ఓటు బ్యాంక్ వైసీపీ వైపే ఉంటోంది. అందులోనూ మాల వర్గం జగన్ వైపు నిలుస్తోంది. ఇది 2019 ఎన్నికల్లో అది మరింత ఎక్కవ ప్రభావం చూపింది. భవిష్యత్‌లోనూ ఎస్సీ ఓటు బ్యాంకు వైసీపీకే ఉంటుందన్న అంచనాలు ఉన్నాయి.

ఈ లెక్కలన్నింటినీ పరిశీలించిన టీడీపీ…ఎస్సీ ఓటు బ్యాంకులో చీలిక కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎస్సీ వర్గీకరణ విషయాన్ని మరోసారి తెరపైకి తెస్తున్నారు. ఎస్ సి మాలల ఓట్లు 34 లక్షలు ఉండగా….మాదిగ ఓట్లు 23 లక్షలు ఉన్నాయి. ఎస్ సి మాల ఓట్లు ఎలాగూ తమకు వచ్చే అవకాశం లేదని భావిస్తున్న ప్రతిపక్ష టిడిపి…ఇప్పుడు మాదిగ వర్గంపై కన్నేసింది. అందులో భాగంగానే వర్ల రామయ్య, జవహర్ వంటి మాదిగ వర్గం నేతలు వర్గీకరణ అంశంపై మీటింగ్ పెట్టారు. ప్రభుత్వంపైనా ఒత్తడి తేవచ్చనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది.

ఒక వేళ ప్రభుత్వ పెద్దలు స్పందిచినా…స్పందిచకున్నా….ఏదో ఒక రూపంలో తమకు లాభం జరుగుతుందని పార్టీనేతలు అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news