ఇండియాలో రికార్డ్ అగ్ని ప్రమాదం, 160 రోజుల నుంచి కొనసాగుతున్న మంటలు…!

-

5 నెలల నుంచి అస్సాంలోని టిన్సుకియా జిల్లాలో బాగ్జన్ చమురు బావి ఇంకా తగలబడుతూనే ఉంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్ సారధ్యంలోని చమురు క్షేత్రంలో మంటల నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా సరే ఫలించలేదు. మంటలు నియంత్రణలో ఉన్నట్టు కనిపించినా సరే ఆ తర్వాత వరుసగా చెలరేగాయి. ఈ ఏడాది మే 27 న మొదలైన ఈ మంటల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

మే 27 ను ప్రారంభ తేదీగా తీసుకుంటే… ఈ బ్లోఅవుట్ సైట్ 160 రోజులుగా కాలిపోతోంది. జూన్ 9 తేదీ భారీ మంటలు కూడా చెలరేగాయి. మంటలు ఆర్పడానికి సంస్థ నిపుణులను నియమించింది. కానీ విజయం సాధించలేదు. ఒఎన్‌జిసి మరియు ఓఐఎల్ జట్లు సంయుక్తంగా మంటలను అరికట్టడానికి ప్రయత్నించాయి. అయినా సరే ఫలితం కనపడలేదు.

తరువాత, సింగపూర్ కేంద్రంగా ఉన్న అలర్ట్ డిజాస్టర్ కంట్రోల్ అనే నిపుణుల బృందం మంటలను అరికట్టడానికి ప్రయత్నం చేసినా ఆగలేదు. 160 రోజుల పాటు ఇండియాలో ఇలా మంటలు ఒక ప్రాంతంలో కొనసాగడం ఇదే తొలిసారి. 1960 వ దశకంలో, అస్సాంలోని సిబ్సాగర్ జిల్లాలో చమురు బావి మంటలు 90 రోజులు ఉన్నాయి. ఆ తర్వాత 1995 లో ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలోని పసర్లపుడి వద్ద జరిగిన పేలుడు కారణంగా ఇదే విధమైన అగ్నిప్రమాదం అదుపులోకి రావడానికి 65 రోజులు పట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news