మెగా ఫ్యామీలిలో పెళ్ళి సందడి..డిసెంబర్ 9న నిహారిక వివాహం!

కరోనా తగ్గుముఖం పట్టడం, లాక్‌ డౌన్‌ సడలింపుల ఇవ్వడంతో మెగా కుటుంబంలో పెళ్ళి సందడి మొదలైంది..మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక డిసెంబర్ 9న పెళ్లిపీటలు ఎక్కబోతోంది..నాగబాబు కూతురు నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల పెళ్లి ముహూర్తం ఖరారు చేశారు కుటుంబం సభ్యులు..డిసెంబర్ 9వ రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నారు..రాజస్థాన్ ఉదయపూర్లోని ఉదయ విలాస్ లో వివాహ వేడుక జరగనుంది.తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గుంటూరు ఐజీ జె.ప్రభాకరరావు వివాహ పత్రికను స్వామివారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్నారు..అనంతరం వివాహ తేదీ, వేడుకను ఖరారు చేసినట్లు ప్రకటించారు.
నాగబాబు తన మిత్రుడైన గుంటూరు జిల్లాకు చెందిన IG జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ చైతన్యతో వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు..ఆగష్టులో నిహారిక, చైతన్యల ఎంగేజ్మెంట్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది..కరోనా లాక్‌డౌన్‌ వల్ల ఈ నిహారికా నిశ్చితార్థ వేడుకకు మెగా కుటుంబం, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు..అప్పట్లో పెళ్లిని ఘనంగా నిర్వహించాలని కుటుంబ సభ్యులు అనుకున్నప్పటికి కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెళ్లిని తాత్కాలికంగా వాయిదా వేశారు..ఇప్పుడు కరోనా తగ్గు ముఖం పట్టడంతో పెళ్లికి సిద్దమయ్యారు.