అర్నబ్ అరెస్ట్ పై చాలా హ్యాపీగా ఉన్నాం…!

-

రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామిని ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం… 2018 లో ఆత్మహత్య చేసుకున్న 53 ఏళ్ల ఇంటీరియర్ డిజైనర్ కుటుంబం హర్షం వ్యక్తం చేసింది. అతన్ని అరెస్టు చేసినందుకు సంతోషంగా ఉందని అన్వాయ్ నాయక్ కుటుంబం తెలిపింది. కేసు మూసివేసేందుకు తమపై చాలా ఒత్తిడి వచ్చింది అని వారు ఆవేదన వ్యక్తం చేసారు. అలీబాగ్ నుంచి వెళ్ళిన పోలీసు బృందం గోస్వామిని తన లోయర్ పరేల్ ఇంటి నుండి ఉదయం అరెస్ట్ చేసింది.

“అర్నాబ్ గోస్వామి అరెస్టుతో మేము సంతోషంగా ఉన్నాము. ఇంతకుముందు పోలీసుల నుండి కేసును మూసివేయాలని మాపై చాలా ఒత్తిడి వచ్చింది. అర్నాబ్ ను డబ్బు తిరిగి ఇవ్వమని మా నాన్న ఇ-మెయిల్ చేసాడు. అది అతనికి జీవన్మరణ సమస్య అని అతని కుమార్తె చెప్పారు. రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించకపోవడంతోనే తన తండ్రి, నాయినమ్మ ఆత్మహత్య చేసుకునేలా చేసింది అని ఆమె పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news