బుజ్జిగాడు సినిమాలో త్రిష పక్కన హీరోయిన్ సంజనా అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు అంతగా గుర్తించకపోయినా తాజాగా ఆమె గురించి వచ్చిన వార్తలు అందరికీ గుర్తుండేలా చేసాయి. కన్నడ చిత్ర పరిశ్రమలో అడపా దడపా సినిమాలు చేసుకుంటున్న అమ్మడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ విషయమై విచారణ కొనసాగుతూనే ఉంది. ఫ్లాప్ హీరోయిన్ అయిన సంజనాకి బెంగళూరు శివార్లలో అన్ని కోట్ల అస్తులు ఎలా వచ్చాయన్న నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది.
ఐతే విచారణ జరుగుతుండగా సంజనా బెయిల్ కి అప్లై చేసింది. మొదటి సారి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టు రెండవసారి కూడా అదే మాట చెప్పింది. దీంతో చేసేదేమీ లేక కటకటాల వెనకే నిలబడింది. సంజనా కేసులో ఎన్నో తెలియని విషయాలు బయటపడుతున్న నేపథ్యంలో ఇప్పట్లో బెయిల్ వచ్చే సూచనలు కనిపించడం లేదు. బెయిల్ వచ్చే వరకూ ఎదురుచూపులు తప్పవు మరి.