ఏపీ ప్రజాప్రతినిధులకి టెన్షన్.. విశాఖపట్నం, కడపలలో స్పెషల్ కోర్టులు !

-

ఏపీలో ప్రజాప్రతినిధులకి కొత్త టెన్షన్ పట్టుకుంది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల మీద ఉన్న అన్ని కేసులని వీలయినంత త్వరగా తేల్చాలని సుప్రీం కోర్టు కంకణం కట్టుకుందన్న సంగతి తెలిసిందే. ఇక ఈరోజు సుప్రీం కోర్టు చేసిన కామెంట్స్ ఏపీలో ప్రజా ప్రతినిదులకి టెన్షన్ మొదలయింది. ప్రజాప్రతినిధుల పై నమోదైన క్రిమినల్ కేసుల పై సుప్రీం కోర్టులో విచారణ విషయం మీద ఈరోజు జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈ సంధర్భంగా ధర్మాసనం నోడల్ అధికారుల నియామకం పై ఆదేశాలు జారీ చేస్తామని పేర్కొంది.

అలానే ప్రతి కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం కల్పనకు నిధుల కేటాయింపు మీద కేంద్ర ప్రభుత్వ వాదనలు విన్న తర్వాత ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. కర్ణాటక, తమిళనాడు, కేరళ పశ్చిమ బెంగాల్ లో ఉన్న కేసుల పై అరా తీసిన ధర్మాసనం. ఆయా అంశాల పై కౌంటర్ దాఖలు చేసేందుకు ఆ రాష్టాలకు రెండు వారాలు సమయం ఇచ్చింది. ఇక ఏపీలో విశాఖపట్నం ,కడప లో ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేస్తామని హైకోర్టు తెలిపిందని అమికస్ క్యూరీ పేర్కొంది. అవసరమైన కేసుల్లో సాక్షులకు రక్షణ కలిపించాలని అమికస్ క్యూరీ కోరగా ప్రతి సాక్షికి రక్షణ కలిపించడం సాధ్యమావుతుందా అని ధర్మాసనం ప్రశ్నించింది.

Read more RELATED
Recommended to you

Latest news