ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీలో చెల్లని రూపాయి అని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు అన్నారు. అక్కడ చెల్లని రూపాయి.. తెలంగాణలో చెల్లుతుందా? అంటూ ఎద్దేవా చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ… నాడు కాంగ్రెస్‌ను కాదని.. తెదేపాలో చేరిన చంద్రబాబు ఆతర్వాత వెన్నుపోటు రాజకీయాలతో గద్దెనెక్కిన విషయం అందరికీ తెలుసన్నారు. గత ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటైనా నెరవేర్చారా? అని నిలదీశారు. విశ్వసనీయ లేని చంద్రబాబుకు, విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఓటమి తప్పదని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు.ఏపీలో చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా వంచన పేరుతో వారం రోజుల పాటు ఆందోళన చేసిన కాంగ్రెస్ పార్టీతో తెలంగాణలో అదే చంద్రబాబుతో పొత్తు ఎలా పెట్టుకుంటుందని నిలదీశారు.తెలంగాణపై చంద్రబాబుకు ప్రేమే ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు కేంద్రానికి లేఖలు ఎందుకు రాశారో చెప్పాలని డిమాండ్ చేశారు.
నిన్న ఖమ్మం సభలో చంద్రబాబును.. అహరీశ్‌రావు అన్నారు. ఎవరైతే ఆయన కడుపులో బుల్లెట్లు దించారో వారి పంచనే గద్దర్ చేరడం చాలా బాధగా ఇబ్బందిగా ఉందన్నారు. ముందు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను చంద్రబాబుని నెరవేర్చి ఆ తర్వాత తెలంగాణలో ఆయన సత్తా చూపితే బాగుంటుంది. అక్కడ ఎలాగో ఈ సారి ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన చంద్రాబాబు..ఇక్కడ గుంటనక్క జిత్తులు వేయడం మంచిది కాదన్నారు. తెలంగాణ ప్రజలు ఓట్ల రూపంలో ఆయనకి సరైన బుద్ధి చెబుతారని తెలిపారు.