ఏపీలో మహిళా ఖైదీలకి ప్రభుత్వం గుడ్ న్యూస్..

-

జైల్లో సత్ప్రవర్తన కలిగి పదేళ్ళు పూర్తి చేసుకున్న మహిళా ఖైదీలను ఏపీలో విముక్తి లభించ పోతుంది. మొన్నటి క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేయడంతో మహిళా ఖైదీలకు శిక్షనుండి మినహాయింపు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. వివిధ నేరాలు చేసి ఎపీలోని పలు జైళ్ళలో శిక్షని అనుభవిస్తున్న మహిళా ఖైదీలలో సత్ప్రవర్తన కలిగి, పదేళ్ళ శిక్ష పూర్తీ చేసుకున్న 55 మందిని, విడుదల చేయనుంది ఏపీ ప్రభుత్వం.

జీవిత ఖైదు శిక్ష పడిన మొత్తం 145 మంది మహిళలలో త్వరలో 55 మంది విడుదల కాబోతున్నారు, క్షణికావేశంలో నేరాలు చేసి ఆ తరువాత శిక్ష అనుభవిస్తూ జైళ్ళలో సత్ప్రవర్తనతో మెలుగుతున్న వారిని మానవతా దృక్పధంతో విడుదల చేయాలని భావిస్తున్నట్టు ప్రభుత్వం చెబుతోంది. మహిళా ఖైదీలలో సత్ప్రవర్తన కలిగేలా జైళ్ళలో అనేక కార్యక్రమాలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతోంది. కడప జైలు నుండి అత్యధికంగా 27 మంది మహిళా ఖైదీలు, రాజమండ్రి నుండి 21 మంది, నెల్లూరు జైలు నుండి ఐదుగురు, విశాఖ నుండి ఇద్దరు మహిళా ఖైదీలను రిలీజ్ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news