బీహార్ ఎన్నికల ఫలితాలకి కౌంట్ డౌన్.. సర్వత్రా ఉత్కంట !

-

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న బీహార్ ఎన్నికల ఫలితాలు రేపు వెలువడనున్నాయి. రేపు కౌంటింగ్ కోసం సర్వం సిద్ధం చేశామని బీహార్ ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కేంద్రాల వద్ద మూడంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశామని ఎన్నికల కమిషన్ చెబుతోంది. బీహార్ వ్యాప్తంగా 55 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హెచ్ఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు.

అయితే ఎన్నికల ఫలితాలు వెలువడెందుకు సమయం పడుతుందని అలానే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల మేరకు ఫలితాలు విడుదల అయ్యాక విజయోత్సవ ర్యాలీలు , ప్రదర్శనలు నిషేధమని ఆయన పేర్కొన్నారు. అయితే బీహార్ లో ఎటువంటి ఫలితాలు వెలువడుతాయి అనే అంశం మీద ఆ రాష్ట్రం వరకే కాదు దేశం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అయితే ఈసారి ఆర్జెడి గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ ఫలితాలు చెబుతుండడంతో జేడీయూ ఆఫీసులు అన్నీ వెలవెలబోతున్నాయి. అయితే ఈ రోజు ఆర్జెడి రథసారధి తేజస్వి యాదవ్ పుట్టినరోజు కావడంతో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు నేతలు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు ఆఫీసు వద్దకు చేరుకున్నారు. దీంతో ఈ రోజే అక్కడ విజయోత్సవ సంతోషం కనిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news