దుబ్బాక లో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతోంది ముందు రౌండ్లలో ఆధిక్యత కనబరుస్తూ వచ్చిన బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు ఆ తర్వాత నెమ్మదించారు. ప్రస్తుతానికి టిఆర్ఎస్ పార్టీ కొన్ని రౌండ్స్ నుండి ఆధిక్యత కనబరుస్తోంది. చివరిగా లెక్కించిన 15వ రాండ్ లో టిఆర్ఎస్ పార్టీకి 955 ఓట్ల ఆధిక్యత లభించింది. అయితే 15వ రౌండ్ లెక్కింపు పూర్తయ్యే సరికి 2483 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ ఉంది.
ఇప్పటి దాకా లెక్కించిన ఓట్ల ప్రకారం బీజేపీకి 43586 ఓట్లు లభించగా టిఆర్ఎస్ కు 41103 వోట్లు సాదించింది. కాంగ్రెస్ కి 14158 ఓట్లు లభించాయి. దుబ్బాకలో పోలయిన ఓట్లు 164192 కాగా అందులో ఇప్పటి వరకు 110214 ఓట్లను లెక్కించారు ఇంకా ఎక్కించాల్సిన ఓట్లు 50 వేల పైదాకా ఉన్నాయి. చివరి మూడ్ రౌండ్స్ నుండి టీఆర్ఎస్ ఆధిక్యత కనబరుస్తోంది. అయితే ఎవరు గెలిచినా భారీ మెజారిటీ ఐతే ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక కత్తి కార్తీక అయితే నోట తో పోటీపడుతున్న సంగతి తెలిసిందే.