దుబ్బాక ఫలితాలు ఆలస్యం వెలువాడుతోన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా నిబంధనలు పాటించడం వల్ల కౌంటింగ్ ప్రక్రియ కాస్త ఆలస్యం అవుతుందని సీఈఓ శశాంక్ గోయల్ తెలిపారు. ఈవియంలు మొరాయించినా బెల్ టెక్నికల్ ఇంజనీర్లు అందుబాటులో ఉన్నారన్న ఆయన ఈ నెల 14వ తేదీ వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని అన్నారు.
కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, నిబంధనలకు లోబడి కొనసాగుతోందని కౌంటింగ్ పై ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని అన్నారు. ఒకవేళ ఈవియంలు తెరుచుకోక పోతే చివరిగా వివిఫ్యాట్స్ ఓపెన్ చేస్తామని ఆయన అన్నారు. ఈవియంల కౌంటింగ్ ముగిసిన తరువాత ఒక ఐదు వివిఫ్యాట్ బాక్సులను లెక్కిస్తామని ఆయన అన్నారు. రాజకీయ పార్టీల ఏజెంట్ల సమ్మతితో రౌండ్ల వారిగా ఓట్ల వివరాలు ప్రకటిస్తున్నామని అన్నారు.