ఏపీలో స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది ఎన్నికల కమిషన్. సి ఎన్నికల నిర్వహణపై దూకుడు పెంచారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ. ఎన్నికల విషయమై చర్చించేందుకు ఇవాళ గవర్నర్ తో భేటీ కాబోతున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. స్థానిక ఎన్నికల నిర్వహణకు ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం రెడీ అవుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని నిన్న ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఈరోజు ఇదే అంశంపై చర్చించడానికి గవర్నర్ బిశ్వభూషణ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ సమావేశం కానున్నారు.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇచ్చిన ఉత్తర్వులపై గవర్నర్ కి వివరించనున్నారు రమేష్ కుమార్. ఇక దీపావళి ముందు రోజు గవర్నర్ తో భేటీ అయిన సీఎం జగన్ ఇప్పట్లో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని చెప్పినట్టు ప్రచారం జరిగింది. కానీ స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అంతే కాక ఇప్పటికే జిల్లాలో విభజనకు సంబంధించి చేపట్టిన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆదేశాలు కూడా జారీ చేశారు నిమ్మగడ్డ రమేష్. సీఎస్ నీలం సహానీ నిమ్మగడ్డ లేఖ రాసిన ఆయన స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకుండా కొత్త జిల్లాలు ఏర్పాటు చేపట్టవద్దని ఆదేశించారు, ఈ క్రమంలో ఇవాళ గవర్నర్ తో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.