నేడు కేసీఆర్ కీలక సమావేశం.. గ్రేటర్ మీదే ఫోకస్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలుతో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. దుబ్బాకలో త్రుటిలో విజయం మిస్ కావడంతో ఈసారి గ్రేటర్ లో ఎలా అయినా గెలిచి పరువు కాపాడుకోవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది అధికార పార్టీ. వరద సాయం పేరిట అందిస్తోన్న పదివేల సాయం తమను కాపాడుతుందని భావిస్తున్నారు.

ఇక ఆరోజు జరిగే ఈ కీలక సమావేశంలో గ్రేటర్ లో టీఆర్ఎస్ వ్యూహం మీద పార్టీ ప్రజాప్రతినిధులకి కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక అందుతున్న సమాచారం మేరకు ఈరోజు రేపట్లో పార్టీ తరపున పోటీ చేసే వారిని కూడా ఆయన ఫైనల్ చేసి లిస్ట్ విడుదల చేసే అవకాశం కూడా ఉంది. ఇక కాంగ్రెస్ – బీజేపీలు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము కూడా పోటీలో ఉన్నామని చెప్పుకోడానికి తెలుగుదేశం కూడా ప్రయత్నం చేస్తోంది.