జగన్ మామూలోడు కాదయ్యో ? ఇదే ఇరగదీసే ప్లాన్ ?

-

ఏపీ సీఎం జగన్ రాజకీయ వ్యూహాలు చూస్తే తలలు పండిన రాజకీయ నాయకులకు సైతం ఒక పట్టాన అర్థం కావు. చాలా ముందుచూపుతో ఆలోచించి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారినా, జగన్ కు మాత్రం రానున్న రోజుల్లో మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకువచ్చే విధంగా మారుతున్నాయి. అందుకే జగన్ తన నిర్ణయాల విషయంలో ముందుగా విమర్శలు వ్యక్తమైన వెనక్కి మాత్రం తగ్గేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. తాజాగా జగన్ తీసుకున్న జిల్లాల పెంపు నిర్ణయం పై సర్వత్రా విమర్శలు వస్తున్నా, జగన్ మాత్రం ఈ విషయంలో వెనకడుగు వేయకుండా పార్లమెంటరీ నియోజిక వర్గానికి ఒక జిల్లా చొప్పున 25 జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు, అదనంగా 7 జిల్లాలను అంటే మొత్తం ముప్పై రెండు జిల్లాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఇదంతా పరిపాలనా సౌలభ్యం కోసమే అని జగన్ చెబుతున్నా, దీని వెనుక వ్యూహం ఉన్నట్టుగానే కనిపిస్తోంది. జగన్ ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికలకు ముందు చేపట్టిన పాదయాత్ర సమయంలోనే జిల్లాల విభజన చేపడతాం అంటూ జగన్ చెప్పారు. దానికి అనుగుణంగానే ఇప్పుడు సరికొత్త నిర్ణయం తీసుకుని అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పక్కనే ఉన్న తెలంగాణలోనూ జిల్లాల పెంపు అనేది జరిగింది. కెసిఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పది జిల్లాలు గా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల ఏర్పాటు చేసి సంచలనం సృష్టించారు. అలాగే గత టిడిపి ప్రభుత్వం సైతం జిల్లాల పెంపుదలకు ప్రయత్నించింది.అయితే జిల్లాల పెంపు అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. పరిపాలనా పరమైన ఖర్చులు చాలా ఉంటాయి. అలాగే ప్రభుత్వ సిబ్బంది సైతం పెద్ద ఎత్తున అవసరమవుతారు. అయితే ఇవన్నీ జగన్ కు తెలియని విషయాలు కాదు.

కానీ జగన్ మాత్రం జిల్లాల పెంపు నిర్ణయం వెనుక పెద్ద మాస్టర్ ప్లాన్ వేసినట్లుగా తెలుస్తోంది. కేంద్రం యూనిట్ గా తీసుకుని పెద్ద ఎత్తున నిధులను కేంద్రం మంజూరు చేస్తుంది . ఉత్తరప్రదేశ్ లోనూ ఇదే తరహాలో జిల్లాలో పెంపుదలను చేసి భారీగా కేంద్ర నిధులను వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు ఏపీలో కొత్త జిల్లాల కు ఇదే రకమైన పరిస్థితులు కూడా ఏర్పడుతాయి.వాటికి నేరుగా కేంద్రం నిధులు ఇస్తుంది. అలా అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రభుత్వానికి అవకాశం దక్కుతుంది. అందుకే జగన్ సైతం ఇప్పుడు ఏపీలో 32 జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించడం వెనుక ఇదే కారణంగా కనిపిస్తోంది. కేంద్ర నిధులతో పాటు, తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లాలలోని నియోజకవర్గాలను ఇదే విధంగా విభజించి రాజకీయంగా టీడీపీని దెబ్బ కొట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకపక్క కేంద్ర నిధులు, మరోపక్క తమ రాజకీయ శత్రువు టిడిపి బలహీన పడడం ఈ రెండింటిని లక్ష్యంగా చేసుకుని జగన్ ఈ జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news