ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి అదనపు ప్రధాన కార్యదర్శిగా ఉన్న డాక్టర్ పి వి రమేష్ రాజీనామాకు ఆమోదం లభించింది. రాజీనామాను ఆమోదిస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన కోరినట్లుగానే నవంబర్ 1 నుంచి రాజీనామా వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజానికి ఈ బాధ్యతల నుంచి తప్పుకున్నా అని ఆయన నాలుగు రోజుల క్రితం స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
నవంబర్ 1న బాధ్యతల నుంచి తప్పుకున్న ఆయన నాలుగు రోజుల క్రితం తాజాగా ట్వీట్ చేశారు. “35 ఏళ్ల నుంచి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ప్రజాసేవ చేస్తున్నా, కెరీర్‌లో ప్రజలకు మెరుగైన సుపరిపాలన, చిత్తశుద్ధితో, పోటీతత్వం తో కూడిన సేవలు అందించేందుకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు” అంటూ ఆయన ట్వీట్ చేశారు. తనకు సీఎం అదనపు ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.