2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కూటమికి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత ఆంధ్ర రాజకీయాల వైపు చూడలేదు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలే జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆ తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకుని బీజేపీకి మద్దతు ప్రకటిస్తామని జనసేన అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని కోరారు. దాదాపు ఆరేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ టిఆర్ఎస్ పార్టీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగుతూనే ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం అప్పుడే మొదలెట్టేసాడు టిఆర్ఎస్ నేతలు. ఇటీవలే టిఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేశారు. ఏపీలో రెండు చోట్ల పోటీ చేసి ఓడిన వ్యక్తి ఇక్కడ పోటీకి దిగాలని అనుకోవడం హాస్యాస్పదం అంటూ విమర్శించారు. కిషన్ రెడ్డి నిస్సహాయుడు గా మారి రెండు చోట్ల ఓడిపోయిన వ్యక్తి దగ్గరికి సహాయం కోరుతూ వెళ్ళాడు అంటూ విమర్శలు గుప్పించాడు బాల్క సుమన్.