జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే… ఈ క్రమంలోనే ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో బిజెపి ప్రచారం చేపడుతున్న తీరును తప్పుబడుతూ విమర్శలు గుప్పించారు. బిజెపి జిహెచ్ఎంసి ఎన్నికల నేపథ్యంలో కావాలని పీవీ నరసింహారావు సమాధి దగ్గర ప్రచారం చేస్తూ డ్రామాలు ఆడుతున్నారు అంటూ విమర్శించారు ఎమ్మెల్సీ కవిత.
పి.వి నరసింహారావు ఈ విషయంలో అంత చిత్తశుద్ధి ఉంటే కేంద్రం వెంటనే ఆయనకు భారతరత్న ప్రకటించాలని అంటూ డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్రం నుంచి తెలంగాణకు ఎంతో సహాయం చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారని… మరి మిగతా రాష్ట్రాలకు కూడా అలాగే ఇచ్చారు కదా అంటూ ప్రశ్నించారు. హైదరాబాద్లో రోహింగ్యాలు ఉన్నారు అంటూ బీజేపీ ఆరోపిస్తోంది అని దేశంలో విదేశీయులు ఉన్నారు అంటే అది కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే కదా అంటూ ప్రశ్నించారు.