కరోనా వ్యాక్సిన్ తయారి కేంద్రానికి మోడీ…?

-

గ్లోబల్ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీతో కలిసి కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారు చేస్తున్న పూణేకు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాను ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సందర్శించనున్నట్లు ఒక సీనియర్ అధికారి జాతీయ మీడియాకు చెప్పారు. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్… ఏడు సంస్థలకు ప్రీ-క్లినికల్ టెస్ట్, ఎగ్జామినేషన్ మరియు ఎనాలిసిస్ కోసం వ్యాక్సిన్ తయారీకి అనుమతి ఇచ్చింది.

“పీఎం మోడీ శనివారం సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సందర్శన గురించి మాకు సమాచారం వచ్చింది. కాని ఇంకా ఆయన షెడ్యూల్ తమకు రాలేదు అని పూణే డివిజనల్ కమిషనర్ సౌరభ్ రావు వెల్లడించారు. వ్యాక్సిన్ తయారి స్థితితో పాటుగా ఉత్పత్తి మరియు పంపిణీ విధానాల గురించి ఆయన తెలుసుకోవడానికి రావొచ్చు అని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news