హైదరాబాద్ లో పెట్టుబడులు ఆగిపోతాయి : హరీష్ రావు

-

గ్రేటర్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అన్ని పార్టీల అగ్రనేతలు తమ తమ అభ్యర్థులను గెలిపించాలని సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా హరీష్ రావు బీజేపీ లాంటి పార్టీ గెలిస్తే హైదరాబాద్ లో పెట్టుబడులు ఆగిపోతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.  బీజేపీ వాళ్ళు హైదరాబాద్ మీద సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఏమి వస్తుంది ? అని ప్రస్నిచిన అయన అమెజాన్ కంపెనీ హైదరాబాద్ లో 21 వేల కోట్ల పెట్టుబడి పెడుతుందని వాళ్ళ వల్ల హైదరాబాద్ లో శాంతి భద్రతల సమస్యలు ఉంటే పెట్టుబడులు ఆగిపోతాయని అన్నారు. బీజేపీ, ఎం ఐ ఎం పార్టీలు ప్రజలను రెచ్చగొట్టి ఓట్ల కోసం నీచ రాజకీయలు చేస్తున్నాయని హరీష్ రావు విమర్శించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో  చేసిన అభివృద్ధి, చేయవలసిన అభివృద్ధి గురించి చెప్పకుండా కూల్చుతాం, కాల్చుతం అని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. వరద బాధితులకు ఇచ్చే సహాయం ను ప్రతిపక్షాలు కూడా అడ్డుకున్నారు నేను ఆర్థిక మంత్రి గా చెబుతున్నా ఎన్నికల ఫలితాల తర్వాత వరద సహాయం అందని ప్రతి ఒక్కరికి సహాయం ఇస్తామని అన్నారు. ప్రశాంత హైదరాబాద్ కావాలా…విధ్వంస హైదరాబాద్ కావాలా ప్రజలు  ఆలోచించండి అని పేర్కొన్న ఆయన టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం అని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news