డిసెంబర్ 1 నుండి 24×7 ఆర్టీజీఎస్‌ సేవలు..

-

భారత్ లో డిజిటల్ చెల్లింపులను పెంచడానికి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (ఆర్టిజిఎస్)ని రౌండ్-ది-క్లాక్ అంటే ఇరవై నాలుగు గంటలు చేసుకునేలా నిధుల బదిలీని అనుమతించింది. ఇది పెద్ద అమౌంట్ ఉన్న లావాదేవీలకు ఉపయోగం అని చెప్పచ్చు. డిసెంబర్ 1 నుండి రౌండ్-ది-క్లాక్ ఈ ఆర్టిజిఎస్ చేసుకోవచ్చు.

నిజానికి ప్రస్తుతం, ప్రతి నెల రెండవ మరియు నాల్గవ శనివారాలు మినహా, వారంలోని అన్ని పని రోజులలో ఉదయం 7.00 నుండి సాయంత్రం 6.00 వరకు ఆర్టిజిఎస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. “దీనితో, ప్రపంచవ్యాప్తంగా 24x7x365 పెద్ద విలువ కలిగిన రియల్ టైమ్ చెల్లింపు వ్యవస్థ కలిగిన అతి కొద్ది దేశాలలో భారతదేశం కూడా ఒకటిగా మారిందని ఆయన అన్నారు. దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్‌బిఐ 2019 జూలై నుండి ఎన్‌ఎఫ్‌టి, ఆర్‌టిజిఎస్ ద్వారా లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయడం మానేసిందన్న సంగతి తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news