నగరంలో శనివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో హైదరాబాద్ పేరును భాగ్యానగర్ గా మారుస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్ పేరు మార్చాలనుకునే వారి పేర్లు మారుస్తామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీ… యోగి పేరు ప్రస్తావించకుండా ఆయన విమర్శలు చేసారు.
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) ఎన్నికల కోసం ప్రచారంలో దిగిన అగ్ర నేతల్లో యోగి కూడా ఒకరు. హైదరాబాద్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన యోగి ఆదిత్యనాథ్, “హైదరాబాద్ ను భాగ్యానగర్ అని పేరు మార్చవచ్చా అని కొందరు నన్ను అడిగారు. నేను చెప్పాను… ఎందుకు కాదు. యుపిలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత మేము ఫైజాబాద్ ను అయోధ్యగా, అలహాబాద్ ను ప్రయాగ్ రాజ్ అని పేరు పెట్టానని వారికి చెప్పాను.” అన్నారు.