పెళ్లి పీటలెక్కబోతున్న మరో సినీ సెలబ్రిటీ..!

-

ఈ ఏడాది ఎంతో మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు అవుతున్నారు అనే విషయం తెలిసిందే. టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా ఎంతో మంది సినీ సెలబ్రిటీలు ఇప్పటికే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు మరో కొత్త జంట కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తుంది. ప్రముఖ సింగర్ పాపులర్ హోస్ట్ అయిన ఆదిత్య నారాయణన్ కూడా తన ప్రియ సఖి ని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు మరికొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

ఇటీవలే ఓ ఇంటర్వ్యూ కు హాజరైన పాపులర్ హోస్ట్ ఆదిత్య నారాయణన్ డిసెంబర్ 1న తన పెళ్ళి జరగబోతున్న ట్లు వెల్లడించారు. దీంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. కరోనా వైరస్ ప్రభావం దృశ్య కేవలం కొంత మంది కుటుంబ సభ్యులు బంధుమిత్రుల సమక్షంలో నే తాను పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు ఆదిత్య నారాయణన్. తాను ప్రేమించిన శ్వేత అగర్వాల్ ని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు. పన్నెండేళ్లుగా తమ మధ్య స్నేహం వద్దు ఇప్పుడు పెళ్ళితో ఒక్కటి అవబోతున్నాము అంటూ చెప్పుకొచ్చాడు.

Read more RELATED
Recommended to you

Latest news