ఇండస్ట్రీలో ఎవరికి ఎప్పుడు గుర్తింపు వస్తుందో ఎవరూ చెప్పలేరు. కొంతమందికి ఫస్ట్ సినిమాతోనే స్టార్డమ్ వస్తే మరికొంతమందికి దశాబ్ధాలు పడుతుంది. ఎన్నోఏళ్లు కష్టపడితేగానే ప్రేక్షకులని రీచ్ కాలేరు. కొంతమందికి పెన్షన్ తీసుకునే టైమ్‌లో కూడా పాపులారిటీ వస్తుంది. ఈ మధ్యకాలం ఇలాగే ఇద్దరు ఆర్టిస్టులు పెద్దవయసులో పాపులారిటీ తెచ్చుకున్నారు.
‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ సినిమా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండకి ఎంత జోష్ ఇస్తుందో, హీరో తండ్రిగా నటించిన గోపరాజు రమణకి అంతకంటే ఎక్కువ జోష్ వస్తోంది. చాలా ఏళ్లుగా నాటకాలు వేస్తూ, సీరియల్స్ చేస్తూ, సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తోన్న రమణకి ఈ మూవీతో మంచి పేరు వచ్చింది. మిడిల్ క్లాస్ ఫాదర్‌గా ఓటీటీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యాడు.
ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు చిన్న డైలాగ్‌తో తెచ్చుకున్నాడు కుమనన్ సేతురామన్. సిక్స్‌టీ ప్లస్‌లో ఒకే ఒక్క డైలాగ్‌తో సూపర్ పాపులర్ అయ్యాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో “రమణ లోడెత్తాలిరా.. చెక్‌పోస్ట్ పడతాది” అనే డైలాగ్‌తో గుర్తింపు తెచ్చుకున్నాడు కుమనన్. ఇక ఈ సినిమా తెచ్చిన ఇమేజ్‌తో కెరీర్‌ని మరో లెవల్‌కి తీసుకెళ్తున్నాడు.