పవన్ రెండు పడవల ప్రయాణంతో అభిమానుల నిరాశ

-

పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్‌కి సైన్‌ చెయ్యగానే, ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. రెండేళ్ల గ్యాప్‌ ఫిల్ అవుతుందని, పవన్ వరుస సినిమాలతో ఎంటర్‌టైన్‌ చేస్తాడని ఎక్స్‌పెక్ట్‌ చేశారు అభిమానులు. కానీ జనసేనాని రెండు పడవల ప్రయాణంతో వీళ్ల ఆశలకు బ్రేకులు పడుతున్నాయి.

పవన్‌ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ తర్వాత సినిమాలకి బ్రేక్‌ ఇచ్చి ఫుల్‌టైమ్‌ పొలిటీషియన్‌గా మారిపోయాడు. మధ్యలో సినిమాలు మానేస్తాడనే టాక్‌ వచ్చినా, 2019 ఎన్నికల్లో ఓడిపోయాక, మళ్లీ కెమెరాముందుకొచ్చాడు. ‘వకీల్‌సాబ్’తో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఒకేసారి 5 సినిమాలకి సైన్‌ చేసి, ఇండస్ట్రీని కూడా ఆశ్చర్యపరిచాడు పవన్.

పవన్ కళ్యాణ్‌ పాలిటిక్స్‌లోకి వెళ్లకముందు ఏడాదికి ఒక సినిమా చేసేవాడు. అయితే పాలిటిక్స్‌ నుంచి మళ్లీ సినిమాల్లోకి వచ్చాక స్పీడ్‌ పెంచాడు. ఒకేసారి నాలుగైదు సినిమాలకి సైన్‌ చేశాడు. క్రిష్‌తో పీరియాడికల్‌ డ్రామా, హరీశ్‌ శంకర్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే మళయాళం మూవీ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్‌కి కమిట్ అయ్యాడు పవన్.

‘వకీల్‌ సాబ్’ సెట్స్‌లో ఉండగానే, క్రిష్‌ పీరియాడికల్‌ డ్రామా షూటింగ్‌ కూడా మొదలుపెట్టాడు పవన్. ఇక పవర్‌ స్టార్‌ ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నాడనగానే, అభిమానులు మొదట ఆశ్చర్యపోయారు. పవన్‌ స్పీడ్‌ చూసి ఆనంద పడ్డారు. బ్యాక్‌ టు బ్యాక్‌ మూవీస్‌ వస్తాయి, రెండేళ్ల గ్యాప్‌ని ఇప్పుడు కవర్‌ చేసుకోవచ్చని ఆశించారు అభిమానులు. అయితే జరుగుతోంది మాత్రం మరోలా ఉందని ఫీలవుతున్నారు.

పవన్‌ కళ్యాణ్ ఫ్యాన్స్‌ చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు గానీ, వాళ్ల ఆశలు తీరేలా కనిపించట్లేదట. జనసేనాని స్కెచ్చులతో అభిమానుల ఆశలు పోస్ట్‌పోన్ అవుతున్నాయి. పొలిటికల్‌ షెడ్యూల్స్, సినిమా షూటింగ్స్‌ క్లాష్ అవుతున్నాయని, రాజకీయాలతో సినిమా షూటింగ్‌లకి బ్రేకులు పడుతున్నాయి అంటున్నారు సినీ జనాలు.

పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలు, సినిమాలు రెండిటిని బ్యాలెన్స్‌ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాడు. కానీ వర్కవుట్‌ కాట్లేదట. పవన్‌ జనసైనికులకు అందుబాటులో ఉండాలనుకుంటే, సినిమా షూటింగ్స్‌ అడ్డొస్తున్నాయి. పోనీ కంటిన్యూస్‌గా షూటింగ్స్‌ చెయ్యాలనుకుంటే పొలిటికల్‌ ఎఫైర్స్‌ తో సినిమా షెడ్యూల్స్‌ మారిపోతున్నాయి.

‘వకీల్‌ సాబ్’ షూటింగ్‌ ఫైనల్‌ స్టేజ్‌కి వచ్చేసింది. బ్రేకుల్లేకుండా సెట్స్‌కి వెళ్తే తక్కువ టైమ్‌లోనే ఈ సినిమా కంప్లీట్ అయ్యేది. కానీ ఢిల్లీ టూర్లు, ఉప ఎన్నికల వ్యూహాలతో షూటింగ్‌ షెడ్యూల్స్‌ పోస్ట్‌ పోన్ అవుతున్నాయి. దీంతో పైప్‌లైన్‌లో ఉన్న మిగతా సినిమాలు కూడా వెనక్కి వెళ్తున్నాయి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

పవన్‌ కళ్యాణ్‌ రెండు పడవల ప్రయాణంలో అటు రాజకీయాలకి, ఇటు సినిమాలకి రెండిటికి క్వాలిటీ టైమ్‌ కేటాయించలేకపోతున్నాడట. పవన్‌ రాజకీయాలకి ఎక్కువ టైమ్‌ ఇస్తే ఏడాదికి ఒక్క సినిమా చెయ్యడం కూడా కష్టం. అలాగని సినిమాలు తగ్గిస్తే అభిమానులు డిసప్పాయింట్‌ అవుతారు. మరి సినిమాలు తగ్గకుండా, పాలిటిక్స్‌లో గ్యాప్‌ రాకుండా సిట్యువేషన్స్‌ని పవన్‌ ఎలా హ్యాండిల్‌ చేస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news