ఓల్డ్ మలక్ పేట డివిజన్ కు రి పోలింగ్ కొద్దిసేపటి క్రితం మొదలయింది. మొన్న డిసెంబర్ 1 పోలింగ్ న బ్యాలెట్ పత్రాల్లో తప్పులు దొర్లడంతో రి పోలింగ్ నిర్వహించాలని ఎస్ఈసి నిర్ణయం. తీసుకుంది. సీపీఐ అభ్యర్థి గుర్తుగా కంకి కొడవలి గుర్తుకు బదులు సీపీఎంకు చెందిన సుత్తి కొడవలి గుర్తు ముర్రించడంతో ఈ ఎన్నికకు రీ పోలింగ్ అవసరం అయింది. ఇక దీనికి కారణం అయిన ఆర్వోను ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. ఇక ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
ఈ దివిజియన్ లో మొత్తం 54655 ఓట్లు ఉండగా అందులో పురుషులు 27889, మహిళలు 26763, ఇతరులు 3 మంది ఉన్న్నారు. ఈ డివిజన్ 26లో ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఓల్డ్ మలక్ పేటలో రిపోలింగ్ సందర్భంగా డివిజన్ లో సెలవు ప్రకటించారు. అలానే డివిజన్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూసివేయలని ఆదేశాలు కూడా జారీ అయ్యాయి.