దూసుకువస్తున్న బురేవి..తమిళనాడు లో హైఅలెర్ట్ 

తమిళనాడుకి మరో తుపాను పొంచి ఉంది. బురేవి తుపాన్ దక్షిణ తమిళనాడు వైపు దూసుకు వెళుతోంది. తుఫాన్ ప్రభావం తో పంబన్ సముద్రతీరం ఉగ్ర రూపం రూపుదాల్చింది. ఈ తుఫాను ఈ రాత్రి కన్యాకుమారి పంబన్ మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈరోజు చెన్నై సహా దక్షిణ తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. ఈ క్రమంలో కన్యాకుమారి, రామనాథపురం, తూత్తుకుడి మొదలైన ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు.

48 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. ఈ సహాయ చర్యల్లో 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పాల్గొన్నాయి. తుఫాను నేపథ్యంలో ఈ తూత్తుకుడి విమానాశ్రయం నుంచి విమాన రాకపోకలు రద్దు చేశారు.. ఇక ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కూడా కనిపిస్తోంది చిత్తూరు జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల తేలికపాటి వర్షం కురుస్తోంది. కడప రాజంపేటలో కూడా భారీ వర్షం కురుస్తోంది. కృష్ణా జిల్లాలో కూడా పలుచోట్ల వర్షం కురుస్తున్న ట్లు సమాచారం.