మీ పిల్ల‌ల‌కు ఎస్‌బీఐలో ఈ అకౌంట్ల‌ను ఇలా సింపుల్‌గా ఓపెన్ చేయండి.. ఫీచ‌ర్లు బాగున్నాయ్‌..!

-

పిల్ల‌లు పెరుగుతున్న కొద్దీ వారికి చ‌దువు చెప్పించ‌డం, వారి అవ‌స‌రాల‌ను తీర్చ‌డం త‌ల్లిదండ్రుల‌కు స‌వాల్ గా మారుతుంది. అద‌న‌పు ఖ‌ర్చులు వ‌చ్చి ప‌డుతుంటాయి. దీంతో ఏం చేయాలో కొన్ని సార్లు త‌ల్లిదండ్రుల‌కు అర్థం కాదు. అయితే వారికి భ‌విష్య‌త్తులో అయ్యే ఖ‌ర్చుల కోసం ముందుగానే జాగ్ర‌త్త ప‌డి పొదుపు చేస్తే ఆ స‌మ‌స్య రాకుండా ఉంటుంది. అందుకు గాను వారి పేరిట బ్యాంక్ అకౌంట్ల‌ను ఓపెన్ చేసి వాటిల్లో డ‌బ్బు వేసి పొదుపు చేస్తుండాలి. వాటిల్లో డ‌బ్బు పొదుపు చేయ‌డం ద్వారా చిన్నారుల‌కు భ‌విష్య‌త్తులో ఏ అవ‌స‌రం వ‌చ్చినా పెద్ద‌గా ఇబ్బంది పడాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. ఇక ఎస్‌బీఐ పిల్ల‌ల కోసం రెండు అకౌంట్ల‌ను ఓపెన్ చేసే వెసులుబాటును క‌ల్పిస్తోంది.

now you can open savings accounts in sbi for your kids

చిన్నారుల కోసం ఎస్‌బీఐ పెహ్లా క‌ద‌మ్‌, పెహ్లీ ఉడాన్ పేరిట రెండు అకౌంట్ల‌ను అందిస్తోంది. వీటిని ఆన్‌లైన్‌లో కూడా ఓపెన్ చేయ‌వ‌చ్చు. ఎస్‌బీఐ వెబ్‌సైట్ sbi.co.in లోని వెళ్లి అందులో ఉండే ప‌ర్స‌న‌ల్ బ్యాంకింగ్ సెక్ష‌న్ లోని అకౌంట్స్ ట్యాబ్ పై క్లిక్ చేసి అనంత‌రం సేవింగ్స్ అకౌంట్ ఫ‌ర్ మైన‌ర్స్ అనే ఆప్ష‌న్‌ను ఎంచుకోవాలి. త‌రువాత అప్లై నౌ క్లిక్ చేసి అనంత‌రం వ‌చ్చే కొత్త పేజీలో ఓపెన్ ఎ డిజిట‌ల్ అకౌంట్ అని ఉంటుంది. అందులో కావ‌ల్సిన వివ‌రాలు నింపి అకౌంట్ ఓపెన్ చేయ‌వ‌చ్చు. అయితే ఒక్క‌సారి బ్యాంక్‌కు వెళ్లి వెరిఫై చేసుకుని రావ‌ల్సి ఉంటుంది.

ఇక పెహ్లీ క‌ద‌మ్ అకౌంట్‌ను చిన్నారులు, వారి త‌ల్లిదండ్రులు, సంర‌క్ష‌కులు క‌లిపి జాయింట్ అకౌంట్‌గా ఆప‌రేట్ చేయాల్సి ఉంటుంది. అదే పెహ్లీ ఉడాన్ అయితే 10 ఏళ్ల క‌న్నా ఎక్కువ వ‌య‌స్సు ఉన్న పిల్ల‌ల‌కు ప‌నికొస్తుంది. వారు సొంతంగా అకౌంట్‌ను ఆప‌రేట్ చేయ‌వ‌చ్చు. ఈ రెండు అకౌంట్ల‌లో గ‌రిష్టంగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు బ్యాలెన్స్ ఉంచ‌వ‌చ్చు. మినిమం బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సిన ప‌నిలేదు.

చెక్‌బుక్‌లు, ఏటీఎం కార్డు స‌దుపాయాలు ఈ రెండింటికీ ఉంటాయి. కానీ ఏటీఎం ద్వారా ఒక రోజుకు రూ.5వేలు మాత్ర‌మే విత్‌డ్రా చేయ‌వ‌చ్చు. అంతే మొత్తంలో షాపింగ్ చేయ‌వ‌చ్చు. అలాగే రోజుకు రూ.2వేల వ‌ర‌కు ఆన్‌లైన్ ట్రాన్సాక్ష‌న్ చేయ‌వ‌చ్చు. ఈ అకౌంట్ల స‌హాయంతో ఎఫ్‌డీ, ఆర్‌డీ అకౌంట్ల‌ను కూడా పిల్ల‌ల పేరిట అందులోనే ఓపెన్ చేయ‌వ‌చ్చు. అలాగే వీటికి ప‌ర్స‌న‌ల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ క‌వ‌రేజీ ల‌భిస్తుంది. దీన్ని పిల్ల‌ల త‌ల్లిదండ్రులు లేదా సంర‌క్ష‌కుల‌కు ఇస్తారు.

ఇక ఈ బ్యాంకు అకౌంట్ల‌కు రోజువారీ బ్యాలెన్స్‌ను బ‌ట్టి వ‌డ్డీ చెల్లిస్తారు. దేశంలో ఎక్క‌డికైనా ఇత‌ర ఎస్‌బీఐ బ్రాంచ్‌కు ఈ అకౌంట్ల‌ను సుల‌భంగా ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. నామినేష‌న్ స‌దుపాయం ఉంటుంది. పాస్‌బుక్‌ను ఉచితంగా ఇస్తారు. ట్రాన్స్‌ఫ‌ర్ ట్రాన్సాక్ష‌న్ల‌కు ఎలాంటి చార్జిల‌ను చెల్లించాల్సిన ప‌నిలేదు.

Read more RELATED
Recommended to you

Latest news