అంబటి రాంబాబుకు మరోసారి కరోనా పాజిటివ్..!

-

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంత మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ మహమ్మరికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. ఈ మహమ్మారిని అరికట్టేందుకు ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అందరు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు అధికారులు అంత వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రజలు కోవిడ్ నియమాలు పాటించాలని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు.

ఇక ఏపీ రాష్ట్రంలో కరోనా కేసుల ఉద్ధృతి కాస్త తగ్గినా, ఇప్పుడు వైరస్ రూటుమార్చడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే గతంలో ఒకసారి కరోనా సోకితే మళ్లీ వచ్చే అవకాశం లేదని అందరూ భావించారు. కానీ, కరోనా మహమ్మారి రెండోసారి కూడా పంజా విసురుతుండటం అందరిని ఆందోళన రేకెత్తిస్తోంది.

తాజాగా.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు రెండోసారి కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఎమ్మెల్యే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. జూలైలో నాకు కోవిడ్ వచ్చి తగ్గిన సంగతి మీ అందరికీ విదితమే. నిన్న అసెంబ్లీలో కోవిడ్ టెస్ట్ చేయించాను. రిపోర్ట్స్ ‌లో పాజిటివ్ వచ్చింది. రీ ఇన్ఫెక్షన్‌ కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించింది. అవసరమైతే ఆస్పత్రిలో చేరతాను. మీ ఆశీస్సులతో కోవిడ్‌ను మరోసారి జయించి మీ ముందుకి వస్తాను. అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

కాగా, ఇప్పటికే తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు కూడా రెండో సారి కరోనా వచ్చింది. దీంతో ఆయన శాసనమండలి సమావేశాలకు సైతం దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో వైసీపీ ముఖ్య నేత అంబటి రాంబాబుకు సైతం రెండోసారి కరోనా సోకింది. కరోనా మహమ్మారి ప్రజలపై ఇలా వరుసగా దాడి చేయడం ఆందోళన కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news