దుబాయ్ వెళ్తున్నారా? అయితే మారియట్ హోటల్ ఫ్రీ ఆఫర్ గురించి తెలుసుకోండి..

-

కరోనా వచ్చిన తర్వాత బాగా నష్టపోయిన రంగమేదైనా ఉందంటే అది పర్యాటక రంగమే అని చెప్పుకోవాలి. లాక్డౌన్ కారణంగా పర్యాటకం అనే పదాన్నే మర్చిపోయారు చాలామంది. ఇంట్లో నుండి బయటకు వెళ్ళకుండా చేసిన కరోనా పర్యాటక రంగాన్ని తీవ్ర నష్టాల్లోకి దారి తీసింది. ఆ నష్టం నుండి బయటపడడానికి పర్యాటక రంగం చాలా కష్టపడాల్సి వస్తుంది. అందులో భాగంగా సందర్శకులని ఆకర్షించడానికి రకరకాల వినూత్న ఆఫర్లతో ముందుకు వస్తున్నారు.

తాజాగా దుబాయ్ జెడబ్ల్యూ మారియట్ హోటల్ సందర్శకులని మంచి ఆఫర్ ని తీసుకువచ్చింది. ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ ద్వారా దుబాయ్ కి వచ్చే సందర్శకులకి రెండు రోజుల పాటు జెడ్ల్యూ హోటల్ లో బస చేసే అవకాశాన్ని ఉచితంగా కల్పిస్తుంది. ఈ మేరకు ఎమిరేట్స్ ఎయిర్ లైన్ ప్రకటించింది. ఎకానమీ క్లాసులో ప్రయాణించిన వారికి ఒకరోజు ఉచితంగా, అలాగే బిజినెస్ క్లాసులో వచ్చిన వారికి రెండు రోజుల పాటు బస ఉచితంగా అందిస్తుంది.

ఈ ఆఫర్ డిసెంబరు 6వ తేదీ నుండి 2021 ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఉండనుంది. ఈ తేదీ మధ్యలో ఎమిరేట్స్ ఎయిర్ లైన్ ద్వారా ఎవ్వరు దుబాయ్ కి వచ్చిన వారికి ఈ సదవకాశాన్ని అందిస్తుంది. దుబాయ్ వాటర్ కెనాల్ పక్కన ఉన్న జెడబ్ల్యూ మారియట్ హోటల్ చాలా ఆకర్షణీయంగా ఉండడంతో పాటు అక్కడి నుండి బుర్జ్ ఖలీఫా, దుబాయ్ మాల్ వంటివి దగ్గరలో ఉంటాయి. 1608గదులు గల హోటల్ లో 15రెస్టారెంట్లతో పాటు బార్లు కూడా ఉన్నాయి.

మరి ఇంకేం, ఇంట్లోనే కూర్చుని వర్క్ చేసుకుంటూ బోరింగ్ గా ఫీల్ అవుతున్న వాళ్ళు ఇలాంటి ఉచిత అవకాశాన్ని వినియోగించుకోండి మరి.

Read more RELATED
Recommended to you

Latest news