చర్మం నిత్య యవ్వనంగా ఉండాలంటే ఇలా ట్రై చేయండి..!?

-

వయస్సు పెరుగుతున్న మీరు యవ్వనంగా కనిపించాలి అనుకుంటున్నారా. ఇక స్త్రీలు చర్మ సౌందర్యం పట్ల ప్రత్యేక జాగ్రత్త లు తీసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. అయితే యోగాని జీవితంలో భాగం చేసుకోవడం వలన నిత్య యవ్వనంగా కనిపిస్తారు. దీనివల్ల రక్త ప్రసరణమెరుగవుతుంది. ఆక్సిజన్ శరీరంలోకి చేరి కణాలను ఉత్తేజితం చేస్తుంది. దీనితో చర్మం మెరుస్తూ ఆరోగ్యంగా ఉంటుంది.

beautiy
beautiy

ఇక నీరు బాగాతాగకపోవడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ కి గురివుతుంది. దీంతో చర్మం ముడతలు పడి వయస్సు లో పెద్దవారిలా కనిపిస్తారు.శరీరంలో ఉన్న టాక్సిన్స్ వల్ల వృద్ధాప్య ఛాయలు తొందరగా వస్తాయి. అదే పరగడుపున గోరువెచ్చని నీరు తాగుతూ రోజంతా నీరు తాగితే రక్త ప్రసరణ మెరుగుపడి చర్మాన్ని సున్నితంగా , కాంతివంతంగా ఆరోగ్యాంగా మెరిసేలా చేస్తుంది.

అయితే స్నానానికి గోరువెచ్చని నీటి ని మాత్రమే ఉపయోగించడం మంచిది.. స్నానానికి వెళ్లే ముందు శరీరానికి నూనె రాసుకుని మస్సాజ్ చేసుకోవాలి. స్నానం తర్వాత మాయిశ్చరైజర్ రాయడం వల్ల చర్మం తాజాగా కనిపిస్తుంది. అలోవేరాని చర్మానికి రాయడం వల్ల విటమిన్ ఈ, సి మరియు బీటాకెరోటిన్ పుష్కలంగా పొందవచ్చు. ఇది చర్మానికి మంచి యాంటీఏజింగ్ గా పనిచేస్తుంది. ఇది జిడ్డుగా ఉండదు కాబట్టి జిడ్డు చర్మం వారుకూడా వాడవచ్చు.

అంతేకాక ఎండలోకి వెళ్లవలిసి వస్తే సన్ స్క్రీన్ తప్పనిసరిగా రాసుకోవాలి. ఆల్కహాల్, పంచదార, మరియు కాఫీ చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తుంటాయి. కాబట్టి వీటికి వీలైనంత దూరంగా ఉండడం మంచిది. చర్మాన్ని వారానికి రెండుసార్లు ఎక్స్‌ఫోలియెట్ చేయవలిసిన అవసరం ఉంది.ఇది కూడా క్లెన్సర్ రాసిన తర్వాత.. మాయిశ్చరైజర్ రాయడానికి ముందు చేయడం వలన డెడ్ స్కిన్ తొలగిపోయి చర్మరంధ్రాలు శుభ్రపడతాయి.ఆహారంలో పండ్లు చేర్చుకోవడం ఉత్తమం . దీని ద్వారా చర్మం ఆరోగ్యం గా మెరుస్తూ ఉంటుంది. పండ్లను తినడమేకాదు.. వాటిని ఫేస్ మాస్క్‌ గా కూడా వేసుకోవచ్చు .

Read more RELATED
Recommended to you

Latest news