సీబీఐ కస్టడీ నుంచి 100 కేజీల గోల్డ్ మాయం

-

ఎప్పుడూ అక్రమార్కుల భరతం పట్టే సీబీఐకి ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. మద్రాస్ హైకోర్ట్ శుక్రవారం తమిళనాడు పోలీసులను సీబీఐ కస్టడీ నుండి మిస్ అయిన 103 కిలోల బంగారంవిషయం మీద దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఈ కేసును గనుక స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తే  “సిబిఐ యొక్క ప్రెస్టేజ్” పోతుందని అందుకే సిబి-సిఐడిని ఎఫ్‌ఐఆర్ నమోదు చేయమని సీబీఐ కోరింది.

ఈ క్రమంలో ఇది సిబిఐకి అగ్ని పరిక్ష కావచ్చు, కానీ వారి చేతులు శుభ్రంగా ఉంటే, సీత లాగా, వారు నిజాయితీగా బయటకు రావచ్చు. అలా కాకపోతే, వారు మ్యూజిక్ ఎదుర్కోవలసి ఉంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. సిబిఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాష్ట్ర పోలీసులకు బదులుగా సిబిఐ లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు చేయమని కోరినప్పుడు, న్యాయమూర్తి పి ఎన్ ప్రకాష్ మాట్లాడుతూ, “కోర్టు ఈ అభిప్రాయానికి రాదు, ఎందుకంటే చట్టం అటువంటి అవకాశాన్ని అనుమతించదని పేర్కొన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news