పెళ్లి తంతును మార్చేసిన కరోనా వైరస్..!?

-

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ప్రజల ఆలోచనల్లో, జీవన విధానంలో కీలక మార్పులు తెచ్చింది. ప్రతి ఒక్కరూ జీవితంలో ఒకేసారి జరుపుకునే పెళ్లి వేడుక కరోనా మహమ్మారి వల్ల పరిమిత సంఖ్యలో బంధుమిత్రులతో జరుపుకోవాల్సి వస్తోంది. కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో ఘనంగా జరుపుకోవాల్సిన పెళ్లి వేడుకలను తూతూ మంత్రంగా జరుపుకుంటున్నారు. అయితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నట్టే కరోనా సమయంలో పెళ్లిళ్లు చేసుకునే వాళ్లు సైతం ఘనంగా పెళ్లి జరుపుకునేందుకు కొత్తగా ఆలోచిస్తున్నారు.

ఈ కొత్త ఐడియాల ద్వారా బంధుమిత్రులు ఎంత దూరంలో ఉన్నా వివాహ వేడుకను చూసే వీలు కల్పించడంతో పాటు ఇంట్లో నుంచే పెళ్లి భోజనాన్ని రుచి చూసే ఛాన్స్ దొరుకుతోంది. ఒక జంట తమ పెళ్లి వేడుకను అందరూ చూడాలని భావించింది. పెళ్లికి హాజరు కాలేని వాళ్లకోసం పెళ్లి పత్రికలోనే వెబ్ క్యాస్టింగ్ ద్వారా పెళ్లిని చూసే అవకాశం కల్పించింది. పెళ్లి అనంతరం పార్శిల్ చేసిన విందు భోజనాన్ని బంధుమిత్రులకు చేరేలా చేసింది.

ఒక విధంగా కరోనా విజృంభణ మనకు చెడు చేసినా మనుషుల ఆహారపు అలవాట్లలో, టెక్నాలజీని వినియోగించుకోవడంలో ఒక అడుగు ముందుకు పడేలా చేసింది. పెళ్లికి హాజరైతే లైవ్ లో సరిగ్గా చూస్తామో లేదో చెప్పలేం కానీ ఆన్ లైన్ లోనే పెళ్లి చూసే అవకాశం ద్వారా కరోనా భయం అక్కర్లేకుండా కుటుంబ సభ్యులంతా పెళ్లిని చూడొచ్చు. భవిష్యత్తులో వివాహాలు ఈ విధంగానే జరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

వినడానికి పెళ్లి వేడుకలో ఇలాంటి ఆలోచనలు వింతగా అనిపించినా ప్రస్తుత పరిస్థితుల్లో ఈ కొత్త ఐడియాల ద్వారా మన బంధుమిత్రులు పెళ్లికి హాజరయ్యారనే సంతోషం కలగడంతో పాటు పెళ్లిరోజున పెళ్లి విందును అందించి ఘనంగా పెళ్లి చేసుకున్నామనే సంతోషం వధూవరులకు కలుగుతుంది. భవిష్యత్తులో పెళ్లి భోజనాన్ని బంధువులకు డెలివరీ చేసే కొత్త సంస్థలు పుట్టుకొచ్చినా పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Read more RELATED
Recommended to you

Latest news