ఎన్టీఆర్ రాజర్షి సాంగ్.. అదిరింది అన్నది చిన్నమాటే..!

-

బయోపిక్ హవాల కొనసాగుతున్న టాలీవుడ్ లో మహానటి సూపర్ హిట్ అవడంతో ఇప్పుడు అందరి దృష్టి ఎన్.టి.ఆర్ బయోపిక్ మీద ఉంది. క్రిష్ డైరక్షన్ లో రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ ఎన్.టి.ఆర్ కథానాయకుడుగా వస్తుండగా సెకండ్ పార్ట్ ఎన్.టి.ఆర్ మహానాయకుడు అంటూ టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో మొదటి పాట రిలీజై ఇప్పటికే సూపర్ హిట్ అవగా ఈరోజు సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

రాజర్షి అనే లిరిక్ తో వచ్చిన ఈ సాంగ్ ను శివశక్తిదత్తా, కీరవాణి, కె.రామకృష్ణ కలిసి రచించారు. ఎన్.టి.ఆర్ గొప్పతనం గురించి అభివర్ణిస్తూ వచ్చే ఈ సాంగ్ వింటే చాలు సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుస్తుంది. ఆదిశంకరాచార్యుల నిర్వాణ శతకం నుండి కొన్ని శ్లోకాలు తీసుకున్నారు. శతత్ సంతోష్, మోహన భోగరాజు, కీరవాణి, కాల భైరవ, శ్రీనిధి, తిరుమల ఈ సాంగ్ పాడారు.

ఈ సాంగ్ విన్న ఎవరైనా అద్భుతం అనక తప్పదు. జనవరి 9న ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమా వస్తుంది. అయితే సెకండ్ పార్ట్ రిలీజ్ విషయమై ఇంకా క్లారిటీ రాలేదు. అసలైతే ఆ పార్ట్ కూడా జనవరి 24న రిలీజ్ ఫిక్స్ చేశారు. కాని అనుకున్న టైం కు వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news